జగిత్యాలలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంట్లోకి లిక్కర్

జగిత్యాలలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంట్లోకి లిక్కర్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణం 46వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ నివాసంలో సోమవారం మద్యం బాటిళ్లు దించుతుండగా ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి బెదిరింపులకు పాల్పడ్డాడని ఎంఐఎం కార్యకర్తలు ఆరోపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.